ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం వద్ద మావోయిస్టు కొరియర్ కారం జగపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిప్పాపూర్, ఆలువాక మార్గమధ్యలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా... ద్విచక్రవాహనంపై తునికాకు కాంట్రాక్టర్‌తో వెళ్తున్న జగపతిని పోలీసులు పట్టుకున్నారు. జగపతి నుంచి 17 లక్షల 40 వేల నగదు, ఒక ద్విచక్రవాహనం, విప్లవ సాహిత్యం, ఓ చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టు కొరియర్ కారం జగపతి అరెస్ట్
మావోయిస్టు కొరియర్ కారం జగపతిని ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. జగపతి నుంచి 17 లక్షల 40 వేల నగదు, ఒక ద్విచక్రవాహనం, విప్లవ సాహిత్యం, ఓ చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. జగపతితో పాటు ఉన్న తునికాకు కాంట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరిని రిమాండుకు తరలించారు.
మావోయిస్టు కొరియర్ కారం జగపతి అరెస్ట్
రాష్ట్ర కమిటీ సభ్యుడు హరి భూషణ్ బడే చొక్కారావు, దామోదర్, కంకణాల రాజిరెడ్డి, శారద, అజాద్, కొయ్యడ సాంబయ్యలాంటి అగ్ర నాయకులకు పార్టీ ఫండ్ అందజేసేవాడని విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. జగపతితో పాటు తునికాకు కాంట్రాక్టర్‌ను రిమాండ్‌కు తరలించారు.