Huge Public At Medaram Temple : కొత్త సంవత్సరం సెలవు దినం అంకావడంతో మేడారంలోని సమ్మక్క-సారలమ్మ (Telangana Tribal Festival) వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో అమ్మవార్ల దర్శనానికి బారులు తీరారు. తలనీలాలు సమర్పించుకుని, జంపన్నవాగు పుణ్య స్నానాలు ఆచరించి దేవతలకు మొక్కలు చెల్లిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు జరిగే మేడారం మహా జాతరకు ముందుగానే భక్తులు సెలవు దినాలు చూసుకొని అమ్మవారి సన్నిధికి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Huge Devotees Rush At Medaram Jathara : తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సమ్మక్క, సారలమ్మ జాతర (Sammakka Saralamma Jathara) ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. దీనిని తెలంగాణ కుంభమేళ అని కూడా అంటారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఆదివాసీ గిరిజన దైవాలు సమ్మక్క-సారలమ్మ జాతర గిరిజన సంప్రదాయం ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు.
భక్తులు ఆందోళన చెందొద్దు - మేడారం మహా జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తాం : మంత్రి సీతక్క
ఏ రోజున ఏ కార్యక్రమం అంటే : 21 ఫిబ్రవరి 2024న సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు గద్దెలపైకి తీసుకువచ్చే కార్యక్రమం చేస్తారు.
22 ఫిబ్రవరి 2024న చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవత గద్దెలపైకి తీసుకువస్తారు.
23 ఫిబ్రవరి 2024న భక్తులు అమ్మవార్లకు తమ మొక్కుల చెల్లించుకుంటారు.