ములుగు జిల్లాలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వెంకటాపూర్, గోవిందరావుపేట, ములుగు మండలాల్లో కురిసిన అకాల వర్షంతో ములుగు పట్టణంలో అక్కడక్కడ రహదారులు జలమయమయ్యాయి.
అకాల వర్షం.. నీటిపాలైన అన్నదాతల కష్టం - ములుగు జిల్లాలో భారీ వర్షం
ములుగు జిల్లాలోని వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లో అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వానతో పలు గ్రామాల్లోని రహదారులు జలమయమయ్యాయి.
ములుగు జిల్లాలో భారీ వర్షం, ములుగు జిల్లాలో వాన
జంగాలపల్లి, వెంకటాపూర్, నర్సాపూర్, గోవిందరావుపేట గ్రామాల్లో ఆరబోసిన వరిధాన్యం అకాల వర్షంతో తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటంతా నీటిపాలవ్వడం వల్ల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.