ములుగు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం గంటపాటు జోరుగా కురిసింది. వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లో తెల్లవారుజాము నుంచే పడిన వానకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నీళ్లు ఇళ్లల్లోకి వస్తాయేమో అని ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం వల్ల ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
అకాల వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాలు - అకాల వర్షానికి తడిసిన ములుగు
ములుగు జిల్లా వ్యాప్తంగా గంటపాటు ఈదురు గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో అకాల వర్షం కురిసింది. జోరుగా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
అకాల వర్షానికి తడిసిన ములుగు