Governor Tamilisai Visits Medaram: ములుగు జిల్లా మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. లక్షలాది మంది ప్రజలు వనదేవతల దర్శనానికి బారులు తీరారు. మేడారం మహాజాతరను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందర్శించారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోడ్డు మార్గంలో మేడారం జాతర చేరుకున్న గవర్నర్‌కు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఘనస్వాగతం పలికారు.
ప్రజలకు ఐశ్వర్యం కలగాలి..
వనదేవతలను దర్శించుకున్న గవర్నర్.. తెలంగాణ ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. అమ్మవారి దయతో ప్రజలకు ఐశ్వర్యం కలగాలని ఆమె ఆకాంక్షించారు. వన దేవతలను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆదివాసీలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని పేర్కొన్న గవర్నర్.. ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు. పోషకాహార సమస్య పరిష్కారం కోసం చిక్కీలు, మహబూబా లడ్డూలు పంపిణీ చేశామన్నారు. మేడారం జాతరలోని భక్తులంతా క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని కోరుకున్నారు. గిరిజనుల జీవనాన్ని చూసేందుకే రోడ్డుమార్గంలో వచ్చినట్లు గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు.
అధికారులపై గవర్నర్ అసంతృప్తి