తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షం.. తడిసి ముద్దయిన ధాన్యం - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

యాసంగి కోతలు ప్రారంభమైన సమయంలోనే కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు నష్టాలనే మిగుల్చుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటి పాలవుతోంది. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ధాన్యాన్ని ఆరబోసినా తేమ శాతం పేరిట కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు.

grain purchase, farmers worry about rains
నీట మునిగిన పంట, రైతుల ఆందోళన

By

Published : Apr 13, 2021, 2:23 PM IST

అకాల వర్షాలతో చేతిదాకా వచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. ఆరుగాలం పడిన శ్రమంతా వర్షార్పణం అవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలోని పలు మండలాల్లో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన యాసంగి పంట తడిసి ముద్దయింది.

యాసంగి పంట కోతలు ప్రారంభం అయ్యాయి. కోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోశారు. పదిహేను రోజులకు పైగా ఆరబోసిన ధాన్యానికి 17 తేమ శాతం వచ్చినా ఇంకా కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. ఐకేపీ, జీసీసీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:ఉగాది పండక్కి నోరూరించే వంటలు..!

ABOUT THE AUTHOR

...view details