అకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం - FARMERS LOSSES WITH HEAVY RAIN IN MULUGU DISTRICT
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా... కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ధాన్యం కుప్పలపై కప్పిన టార్ఫిన్లు గాలి ధాటికి కొట్టుకుపోయాయి. అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం వర్షార్పణం కావటం వల్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆకాల వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం