CM KCR Public Meeting at Mulugu : ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు తప్ప.. ఇంకేమీ లేదని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) అన్నారు. కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు వచ్చాయా.. పోడు పట్టాలు ఇచ్చిందా అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
తెలంగాణ రావాలని సమ్మక్క-సారలమ్మ తల్లులకు ఎన్నో సార్లు మొక్కానని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎన్నికల్లో పార్టీల దృక్పథం చూసి ఓటేయాలని కోరారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం.. రాష్ట్ర హక్కుల కోసమని అన్నారు. పదిహేనేళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నామని వివరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లుగా బీఆర్ఎస్(BRS) అధికారంలో ఉందని.. కానీ కాంగ్రెస్ 50 ఏళ్ల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిందని పేర్కొన్నారు. అయితే ఎవరి పాలనలో ఎంత మేలు జరిగిందో పోల్చి చూడాలని ములుగు సభకు విచ్చేసిన ఓటర్లను కోరారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నికల సభలు జరగవు - మన దేశంలోనూ అలాంటి విధానం రావాలి : సీఎం కేసీఆర్
BRS Praja Ashirvada Sabha at Mulugu in Telangana : కంటి వెలుగు(Kanti Velugu) వంటి కార్యక్రమాన్ని ఎవరూ ఊపించలేదని.. ప్రతి గ్రామంలో శిబిరాలు ఏర్పాటు చేసి 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 80 లక్షల మందకి కళ్లద్దాలు పంపిణీ చేశామని వివరించారు. ఆడబిడ్డల పెళ్లికి కల్యాణ లక్ష్మి కిందర రూ.లక్ష 116 ఇస్తున్నామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచి నీరు ఇస్తున్నామని గుర్తు చేశారు. రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదని రేవంత్రెడ్డి అంటున్నారని.. అలాగే ధరణిని తీసి బంగాళాఖాతంలో కలుపుతామని అంటున్నారని మండిపడ్డారు.