తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారం జాతరలో ఉచితంగా బట్టలు ఉతికిస్తారండోయ్.. - మేడారం జాతరలో ఉచితంగా బట్టలు ఉతికిస్తారండోయ్..

కొనుగోలుదారుల దగ్గరికి వెళ్లి వారి ఉత్పత్తులను కొనుగోలు చేసేలా ఆకర్షించడం వ్యాపారస్థుల సూత్రం. కానీ ఓ కంపెనీ వాళ్లు మేడారం జాతరలో వెరైటీ మార్కెటింగ్ చేస్తున్నారు. పుణ్యానికి పుణ్యం..మార్కెటింగ్​కి మార్కెటింగ్ వస్తుందనే ఆలోచనతో ఏంచేస్తున్నారో చూడండి..

clothes free washing in medaram
మేడారం జాతరలో ఉచితంగా బట్టలు ఉతికిస్తారండోయ్..

By

Published : Feb 5, 2020, 10:06 AM IST

Updated : Feb 5, 2020, 11:48 AM IST

మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలొస్తుంటారు. ఈ అతిపెద్ద జాతరను ఓ వాషింగ్​ మెషిన్ల కంపెనీ మంచి మార్కెటింగ్​ మార్గంగా ఎంచుకుంది. భక్తులకు ఉచితంగా బట్టలు ఉతికిస్తామంటూ ముందుకొచ్చింది. జనసంద్రంగా మారిన జాతరలో భక్తులకు సేవ చేస్తే పుణ్యానికి పుణ్యం..తమ ఉత్పత్తులపై ప్రజలకు నమ్మకం కలిగించొచ్చని ఇలా వెరైటీగా మార్కెటింగ్ చేస్తోంది.

మేడారం జాతరలో ఉచితంగా బట్టలు ఉతికిస్తారండోయ్..

దాంతో పాటు ఉచిత తాగునీరు, మాస్క్​లు పంపిణీ చేస్తుంది. మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 40 వాటర్ ప్యూరిఫైయర్లు, 30 వాషింగ్ మిషన్లను ఏర్పాటు చేసింది.

ఈ ఉచిత సేవలు జాతర అయిపోయే వరకు కొనసాగిస్తామని ఆ కంపెనీ ప్రతినిధి మోహర్​ తెలిపారు. ఉచితంగా బట్టలు ఉతికిస్తుండటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఆద్యంతం.. కోలాహలమే.. నేడు సారలమ్మ ఆగమనం

Last Updated : Feb 5, 2020, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details