తెలంగాణ

telangana

ETV Bharat / state

'చెరువు మరమ్మతులు ప్రారంభించేలా చర్యలు చేపడతాం' - నీటి పారుదలశాఖ

తాడ్వాయి మండలం కాటాపూర్​లో జడ్పీ ఛైర్మన్ జగదీశ్వర్​ పర్యటించారు. అన్నారం పెద్ద చెరువు మరమ్మతులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.

actions will be taken to start pond repairs says zp chairman in tadwai mulugu
'చెరువు మరమ్మతులు ప్రారంభించేలా చర్యలు చేపడతాం'

By

Published : Jan 25, 2021, 7:02 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్​లో జడ్పీ ఛైర్మన్ జగదీశ్వర్​ పర్యటించారు. స్థానిక రైతుల అభ్యర్థన మేరకు అన్నారం పెద్ద చెరువును పరిశీంచారు.

చెరువుకు బుంగపడటం, మత్తడి చెడిపోవడం, పూడిక తీత.. తదితర సమస్యలపై రైతులు జడ్పీ ఛైర్మన్​కు విన్నవించుకున్నారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. సమస్యలు పరిష్కారం కాలేదంటూ మొరపెట్టుకున్నారు.

దీనిపై స్పందించిన జడ్పీ ఛైర్మన్.. పూర్తి స్థాయిలో సమస్యలన్నింటిని ఓ నివేదిక రూపంలో తనకందించాలని రైతులను కోరారు. ఇరిగేషన్ ఉన్నతాధికారులు, నీటి పారుదలశాఖతో చర్చించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:పొలాల్లో పులి సంచారం.. భయాదోళనలో స్థానికులు

ABOUT THE AUTHOR

...view details