రోడ్లపై ఆకతాయిల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కొందరి రాష్ డ్రైవింగ్ కారణంగా ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ ఇలాంటి ఘటన హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
యువకుడి రాష్ డ్రైవింగ్... వృద్ధుడికి తీవ్ర గాయాలు - Road accidents in Kukatpally
హైదరాబాద్ కేపీహెచ్బీ ఠాణా పరిధిలో ఓ యువకుడి రాష్ డ్రైవింగ్ కారణంగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
యువకుడి రాష్ డ్రైవింగ్... వృద్ధుడికి గాయాలు
వాసుదేవరావు అనే వృద్ధుడు ద్విచక్రవాహనంపై వెళుతుండగా... ఓ యువకుడు నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన వాసుదేవరావును పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. బాధితుని ఫిర్యాదు మేరకు యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా జల్లెడ పడుతున్నారు.
ఇదీ చదవండి:వలపు వలతో నిలువుదోపిడీ చేసే మాయలేడి అరెస్ట్