తెలంగాణ

telangana

ETV Bharat / state

దుండిగల్ మల్లంపేటకు చెందిన యువతి అదృశ్యం - మల్లంపేట్

పక్కింటికి వెళ్లి  వస్తానని చెప్పి ఇంటి నుంచి  బయటికి వెళ్లిన యువతి  అదృశ్యమైన   సంఘటన మేడ్చల్ జిల్లా  దుండిగల్​లో చోటుచేసుకుంది.

దుండిగల్ మల్లంపేటకు చెందిన యువతి అదృశ్యం

By

Published : Aug 7, 2019, 1:04 AM IST

దుండిగల్ మల్లంపేటకు చెందిన యువతి అదృశ్యం

మేడ్చల్ జిల్లా దుండిగల్​ మండలం మల్లంపేట్​కి చెందిన మహేశ్వరి గత నెల 29న సాయంత్రం ఏడు గంటల సమయంలో తెలిసిన వారి ఇంటికి వెళ్తానని చెప్పి అదృశ్యమైంది. రాత్రి తొమ్మిది గంటల వరకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు చుట్టు పక్కల, బంధువుల ఇళ్లలో ఎంత వెతికిన ఆచూకీ లభించలేదు. విష్ణుజోషి అనే వ్యక్తి పై అనుమానం ఉందని తెలిపిన అమ్మాయి తండ్రి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి అదృశ్యమైన వారం తర్వాత ఫిర్యాదు రావడంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details