మోడ్చల్ జిల్లా హకీంపేట్ సింగాయపల్లిలో తాగునీరు రావడం లేదని గ్రామస్థులు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. జలమండలి అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ వెంటనే స్పందించాలని కోరారు. రోజూ మిషన్ భగీరథ ద్వారా సరిపడా నీటిని విడుదల చేయడం లేదని వాపోయారు. పోలీసులు ధర్నా చేస్తున్న ప్రాంతానికి చేరుకొని గ్రామస్థులతో మాట్లాడారు. నీటి సమస్యను పరిష్కరించే విధంగా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పగా... గామస్థులు ఆందోళన విరమించారు.
నీటికోసం రోడ్డెక్కిన సింగాయపల్లి గ్రామస్థులు - మిషన్ భగీరథ
మోడ్చల్ జిల్లా హకీంపేట్ సింగాయపల్లి గ్రామస్థులు తాగునీటి ఎద్దడి తీర్చాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వచ్చి గ్రామప్రజలతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.
నీటికోసం రోడ్డెక్కిన సింగాయపల్లి గ్రామస్థులు