మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ ఘటనలో పలువురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన సీఐ భిక్షపతిరావు, కానిస్టేబుల్ అరుణ్‌లు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాళ్లు, చేతులకు 45 శాతం కాలిన గాయాలైన సీఐని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు.
యశోదలో సీఐ భిక్షపతి, కానిస్టేబుల్ అరుణ్‌లకు చికిత్స - medchal district news
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ ఘటనలో కాలిన గాయాలతో బాధపడుతున్న సీఐ భిక్షపతి రావుకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
యశోదలో సీఐ భిక్షపతి, కానిస్టేబుల్ అరుణ్‌లకు చికిత్స
గురువారం రోజున జవహర్‌నగర్ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపులో కబ్జాదారులు మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులపై దాడి చేశారు. సీఐ భిక్షపతిరావు, కానిస్టేబుల్ అరుణ్‌పై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
- ఇదీ చూడండి :జవహర్‌నగర్ ఘటనలో పలువురిపై కేసు నమోదు