తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth reddy On KCR: మీకు ధైర్యం ఉంటే అసెంబ్లీలో తీర్మానం చేయండి: రేవంత్ రెడ్డి - టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి

సీఎం కేసీఆర్​కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి(Revanth reddy On KCR) డిమాండ్‌ చేశారు. ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటున్న సీఎం మద్దతు ధర ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్​లోని కొంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు.

Revanth reddy On KCR
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి

By

Published : Nov 9, 2021, 8:25 PM IST

భాజపాపై తీవ్ర విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth reddy On KCR)డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో మీరు మోదీ కనుసన్నల్లోనే నడుస్తున్నట్లేనని విమర్శించారు. హైదరాబాద్​లోని కొంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్‌ శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పనై పోయిందన్న కేసీఆర్.. హుజూరాబాద్​లో భాజపాతో కలిసి ఓడించిందని ముఖ్యమంత్రి అనలేదా అని నిలదీశారు.

ప్రత్యామ్నాయ పంటలు వేయాలంటున్న సీఎం కేసీఆర్ వాటికి కనీస మద్దతు ధర ఎందుకు ప్రకటించడం లేదని నిలదీశారు. విత్తన కంపెనీలకు అమ్ముడు పోయినందునే రాష్ట్రంలో ఒక వ్యవసాయ విధానమంటూ లేదని ఆరోపించారు. ప్రజలు అధికారమిచ్చింది ధర్నాలు చేయడానికా... పరిపాలన చేయడానికా అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై అన్ని ఆధారాలు దిల్లీలో ఇచ్చినా కూడా మోదీపై ఉన్న నమ్మకంతో ధైర్యంగా ఉన్నారని ఆరోపించారు. బండి సంజయ్‌కి సవాల్ విసిరిన ముఖ్యమంత్రి.. మోదీకి ఎందుకు సవాల్‌ విసరలేదని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు, సంతోష్‌ల ఎన్నికల అఫిడవిట్లు చూస్తే ఎంత సంపాదించారో బయటపడుతుందన్నారు. అన్ని ఆస్తులు ఏలా వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేవలం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని తిట్టడానికే సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లు పెడుతున్నారని టీపీసీసీ రేవంత్ రెడ్డి విమర్శించారు.

ఇదీ చూడండి:

Revanth Reddy: 'మనం కొట్టుకోవడం కాదు.. తెరాస, భాజపాలపై మన ప్రతాపాన్ని చూపిద్దాం'

ABOUT THE AUTHOR

...view details