జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న యువకుడిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా ప్రగతి నగర్లో నివాసముంటున్న శ్రీరామ్ ప్రధాన కూడళ్ల వద్ద ఉండి డెలివరీ బాయ్స్‌ను గమనిస్తూ డెలివరీ చేసే సమయంలో వారి వద్ద ఉన్న బ్యాగును అపహరించేవాడు. చదువు మానేసి 2017లో చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతున్న శ్రీరామ్‌ను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసినా... అతని తీరు మారలేదు.
చోరీలకు పాల్పడుతున్న యువకుడి అరెస్టు - arrest
జల్సాలకు అలవడి చోరీలకు పాల్పడుతున్న శ్రీరామ్ అనే యువకుడిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న నాలుగు లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
చోరీలకు పాల్పడుతున్న యువకుడి అరెస్టు
ఫిర్యాదు అందుకున్న దుండిగల్ పోలీసులు శ్రీరామ్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతడివద్ద ఉన్న నాలుగు లక్షల విలువైన వస్తువులు, రెండు ద్విచక్రవాహనాలు, 15 సెల్ఫోన్లు, దొంగిలించిన బ్యాగులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఇవీ చూడండి: విద్యాధికారి ఇంట్లో దొంగల బీభత్సం