తెలంగాణ

telangana

ETV Bharat / state

తండ్రిని ముక్కలుగా నరికి... బకెట్​లో పడేశాడు - father

ఏ తండ్రైనా తన కుమారుడు తనకంటే గొప్పవాడు కావాలని కోరుకుంటాడు. కుమారున్ని ప్రయోజకున్ని చేయాలని అహర్నిశలు శ్రమిస్తుంటాడు. అలానే ఓ  తండ్రి తన కొడుకు మంచి స్థానంలో స్థిరపడాలని కోరుకున్నాడు. ఏది అడిగినా ఇచ్చాడు. కానీ ఆ కొడుకు జులాయిగా తిరిగాడు. తాగుడుకు బానిసయ్యాడు. కసాయిగా మారి తనకు జీవితాన్నిచ్చిన తండ్రిని హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి బకెట్​లో వేశాడు. ఈ ఘటన మల్కాజిగిరిలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

అంబులెన్సులో బకెట్లు

By

Published : Aug 19, 2019, 4:07 AM IST

Updated : Aug 19, 2019, 7:37 AM IST

తండ్రిని ముక్కలుగా నరికి... బకెట్​లో పడేశాడు

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పోలీస్​స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మౌలాలి ఆర్టీసీ కాలనీలో కిషన్ అనే వ్యక్తి తండ్రి మారుతీని కత్తితో పొడిచి హత్య చేశాడు. కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి బకెట్​లో వేశాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడం వల్ల స్థానికులు లోపలికి వెళ్లి చూశారు. భయాందోళనకు గురైన వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

నిందితుడి కోసం గాలింపు

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన విధానాన్ని చూసి షాక్​కు గురయ్యారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. మృతుడు మారుతీ విశ్రాంత రైల్వే ఉద్యోగని, నిందితుడు కిషన్ ఆటో నడుపుతుంటాడని పోలీసులు తెలిపారు. తాగుడుకు బానిసైన కిషన్ తండ్రితో తరచూ గొడవపడేవాడని స్థానికులు చెబుతున్నారు. తండ్రి తిడుతుండటం వల్ల విసుగుచెంది హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు.

తల్లి, చెల్లి అక్కడే

హత్య జరిగిన సమయంలో తల్లి, చెల్లి ఇంట్లోనే ఉన్నారని తెలిసిన పోలీసులు వారిని విచారించారు. కిషన్​కు భయపడి విషయాన్ని చెప్పలేక పోయామని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నామని చెబుతుంటే అతని బంధువులు మాత్రం పోలీసులకు లొంగిపోయాడని చెబుతున్నారు.

ఇవీ చూడండి : కామాంధుడు... మనవరాలినీ వదల్లేదు

Last Updated : Aug 19, 2019, 7:37 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details