మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో దారుణం జరిగింది. శామీర్‌పేటకు చెందిన శ్యాంసుందర్ అనే విద్యార్థి ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతిచెందాడు. కీసరగుట్ట గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న శ్యాంసుదర్ స్నేహితులతో కలిసి ఆలయ సమీపంలోని నీటికుంటలో ఈతకు దిగాడు. ఈతకొడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కీసరగుట్టలో నీటమునిగి విద్యార్థి మృతి - keesaragutta
కీసరగుట్టలో నీటిలో మునిగి గురుకుల పాఠశాల విద్యార్థి మృతిచెందాడు. స్నేహితులతో కలిసి ఆలయ సమీపంలోని నీటికుంటలో ఈతకు దిగిన శ్యాంసుందర్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
కీసరగుట్టలో నీటమునిగి విద్యార్థి మృతి