స్వస్థలాలకు వెళ్లేందుకు మేడ్చల్ రహదారిపై వలస కూలీలు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారా..? అనే విషయం పరిశీలించేందుకు అడ్వొకేట్ కమిషన్‌ను హైకోర్టు నియమించింది. న్యాయవాది పవన్‌కుమార్‌ను నియమించిన ఉన్నత న్యాయస్థానం... మేడ్చల్ వెళ్లి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వలసకార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు మేడ్చల్ రహదారిలో మండుటెండలో నడుచుకుంటూ వెళ్తున్నారని.. వారి కోసం బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త రమా మెల్కొటే దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.
మేడ్చల్‌లో వలస కూలీల కష్టాలపై హైకోర్టులో విచారణ - తెలంగాణ తాజా వార్తలు
స్వస్థలాలకు వెళ్లేందుకు మేడ్చల్ రహదారిపై వలసకూలీలు ఇబ్బంది పడున్నారన్న వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. మేడ్చల్‌లో పరిస్థితితులను ప్రత్యక్షంగా పరిశీలించడానికి అడ్వొకేట్ కమిషనర్‌గా పవన్‌కుమార్‌ను న్యాయస్థానం నియమించింది.
మేడ్చల్ రహదారిపై ప్రస్తుతం వలస కూలీలు లేరని.. అందరినీ స్వస్థలాలకు తరలించామని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. అయితే ఇప్పటికీ వందలాది మంది మేడ్చల్ రహదారిపై నడుచుకుంటూ వెళ్తూ ఇబ్బంది పడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధ నాగరాజు వాదించారు. అడ్వకేట్ కమిషన్‌తో పాటు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి కూడా వెళ్లాలని ఆదేశించింది. వారికి అవసరమైన రవాణా, ఇతర వసతులు కల్పించాలని మేడ్చల్ కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా వేసింది.