నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం కాచవాని సింగారంలో మల్లన్న భవిష్యత్తు కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అనుచరులు భారీగా తరలివచ్చారు. సమావేశానికి వచ్చిన అనుచరులు రాజకీయ పార్టీ పెట్టాలని, సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని సూచించారు. అందుకు స్పందించిన మల్లన్న తన కార్యాచరణను ప్రకటించారు.
రాజకీయ పార్టీ పెట్టడం లేదు: తీన్మార్ మల్లన్న - హైదరాబాద్ తాజా వార్తలు
సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయట్లేదని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మాత్రం తెరాస చేస్తున్న అవినీతి, అక్రమాలపై ప్రచారం నిర్వహిస్తామని, ఏ పార్టీకి మద్దతు ఇవ్వమని చెప్పారు. మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం కాచవాని సింగారంలో భవిష్యత్తు కార్యాచరణ సమావేశంలో భాగంగా ఆయన వెల్లడించారు.
త్వరలో రాష్ట్రంలో ఆరు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. అందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. తీన్మార్ మల్లన్న టీం పేరిట రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయి కమిటీలను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టనని వెల్లడించారు. సాగర్ ఎన్నికలో ఓ పార్టీ బీ-ఫామ్‌తో పోటీ చేయాలని, అందుకు రూ.100 కోట్లు ఖర్చు చేస్తామని తన వద్దకు వచ్చారని చెప్పారు. మేమే మీకు రూ.101 కోట్లు ఇస్తాం.. మీ పార్టీని మల్లన్న టీంలో విలీనం చేస్తారా అని అడిగితే సమాధానం చెప్పలేదని వివరించారు.
ఇదీ చూడండి :'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా కవి సమ్మేళనాలు