తెలంగాణ

telangana

ETV Bharat / state

సైనైడ్​తో ఆత్మహత్యాయత్నం.. వ్యక్తి మృతి - dead body

మేడ్చల్​ జిల్లా పట్టణంలోని జాతీయ రహదారి సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి  మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనితో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

సైనైడ్​తో ఆత్మహత్యాయత్నం.. వ్యక్తి మృతి

By

Published : Nov 18, 2019, 9:15 AM IST

మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న స్నేహాలత క్రేన్ సర్వీస్ సెంటర్ వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్​లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మృతుడు హైదరాబాద్​లోని చిక్కడపల్లి ప్రాంతం సూర్యానగర్​కు చెందిన నర్సింహాచారి అని... కుటుంబ కలహాలతో సైనైడ్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

సైనైడ్​తో ఆత్మహత్యాయత్నం.. వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details