ఓడినా గెలిచినా... ప్రజల మధ్యే జీవితం - malkajgiri
రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు మల్కాజిగిరిలో ఓడిపోయిన అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి. ఇక నుంచి నిరంతరం ప్రజల్లోనే ఉంటానని తెలిపారు.
మర్రి రాజశేఖర్ రెడ్డి
ఐదు లక్షల పైచిలుకు ఓట్లు వేసిన నియోజకవర్గ ప్రజలకు మల్కాజిగిరిలో ఓడిపోయిన తెరాస అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. తనకు సహకరించిన కార్యకర్తలు, నాయకులకు రుణపడి ఉంటానన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వృద్ధాప్య పింఛను పెంచడం హర్షణీయమన్నారు. తనపై నమ్మకం ఉంచి పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు.