తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడ్చల్​లో ఘనంగా సీతారాముల కల్యాణం - రామయ్య కల్యాణం

రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ రామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు ఆలయాల్లో సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. మేడ్చల్​ జిల్లా కీసరలో జరిగిన రామయ్య కల్యాణానికి భక్తులు భారీగా హాజరయ్యారు.

రామయ్య కల్యాణం

By

Published : Apr 14, 2019, 4:58 PM IST

శ్రీ రామ నవమి సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయి గూడ వద్ద శ్రీ సీతారాముని కల్యాణం ఘనంగా జరిగింది. పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ సీతమ్మ మెడలో రామయ్య మాంగల్య ధారణ చేశారు. సుధాకర్​ దంపతులు పూజలో పాల్గొన్నారు. కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సీతా రాముల వివాహాన్ని చూసిన భక్త జనం పారవశ్యంలో మునిగిపోయారు. కల్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.

ఘనంగా రామయ్య కల్యాణం

ABOUT THE AUTHOR

...view details