తెలంగాణ

telangana

'ఇలా చేస్తేనైనా సమస్య పరిష్కరిస్తారేమో అని...'

ఏళ్లు తరబడి కాలనీలో సమస్యలపై ఫిర్యాదు చేసినా... జీహెచ్​ఎంసీ అధికారులు పట్టించుకోవడంలేదని ఓ సామాజిక కార్యకర్త వినూత్న రీతిలో నిరసన తెలిపాడు.

By

Published : Feb 25, 2020, 1:21 PM IST

Published : Feb 25, 2020, 1:21 PM IST

social worker protest on problems at their colony in malkajgiri
'ఇలా చేస్తేనైనా సమస్య పరిష్కరిస్తారేమో అని...'

మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్​కు చెందిన రమేశ్ సామాజిక కార్యకర్త. స్థానికంగా నివాసముంటున్న రమేష్​... కాలనీలోని సమస్యలపై జీహెచ్​ఎంసీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మెడలో ఫ్లకార్డులు వేసుకుని నిన్న జరిగిన ప్రజావాణీ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇదే ప్రధాన సమస్య..

మల్కాజిగిరి బండ చెరువులో అక్రమంగా ఇంటి నిర్మాణాలకు అధికారులు అనుమతులు ఇచ్చారని... వీటి వల్ల చెరువు భాగం తక్కువై... పక్కనున్న కాలనీలోకి మురుగు చేరుతోందని రమేశ్ ఆరోపించారు. ఆ దుర్గంధంతో ఊపిరి ఆడటం లేదని... రోగాలు ప్రబలుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

'ఇలా చేస్తేనైనా సమస్య పరిష్కరిస్తారేమో అని...'

ఇవీ చూడండి:వాతలు పెట్టి, తాళ్లతో బంధించి... నరకం చూపారు

ABOUT THE AUTHOR

...view details