మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో రోజురోజుకు వైరస్ విజృంభిస్తోంది. వైరస్ బారిన పడిన ఇంటిని కంటైన్మెంట్ చేయడం.. ఆ ప్రాంతాన్ని రసాయనాలతో పిచికారీ చేసి.. బారికేడ్లు వేసి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. వైరస్ బారిన పడిన గాజులరామారం డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని శానిటేషన్ చేశారు.
కంటైన్మెంట్ జోన్లలో శానిటేషన్ చేస్తున్న అధికారులు - hyderabad latest news
హైదరాబాద్ నగరంలో రోజురోజుకు కరోనా విలయతాండవం చేస్తోంది. కుత్బుల్లాపూర్ పరిధిలోని వైరస్ బారిన పడిన పలు ప్రాంతాల్లో అధికారులు త్వరితగతిన శానిటేషన్ పనులను చేస్తున్నారు.

కుత్బుల్లాపూర్ కంటైన్మెంట్ జోన్లలో శానిటేషన్ చేస్తున్న అధికారులు
ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చేతులను శుభ్రం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయ పనుల పరిశీలన.. పురోగతిపై ఆరా