తెలంగాణ

telangana

ETV Bharat / state

దోపిడీ ముఠా అరెస్టు - మహారాష్ట్ర

జల్సాలకు అలవాటు పడ్డ ఓ ముఠా రాత్రి వేళల్లో దోపిడీకి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్​లో చోటు చేసుకుంది. లారీ చోదకుడిని బెదిరించి అతని వద్ద నుంచి నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

లారీ డ్రైవర్‌ను బెదిరించి రూ.3వేల నగదు లాక్కున్న ముఠా

By

Published : Jul 11, 2019, 11:53 PM IST

అర్థరాత్రి వేళల్లో కారులో తిరుగుతూ దోపిడీకి పాల్పడుతున్న నలుగురు యువకులను ఘట్‌కేసర్‌ పోలీసులు అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటుపడి హత్య, దొంగతనాల నేరం కింద జైలుకు వెళ్లిన యువకులు ఇటీవలే బైయిల్‌పై విడుదలయ్యారు. మేడిపల్లి మండలానికి చెందిన రంగు ఉదయ్‌గౌడ్‌, ఒగ్గు నాగరాజు, అక్షయ్‌కుమార్‌, మామిడాల రాజులు ఓ ముఠాగా ఏర్పాడ్డారు.

పట్టుబడ్డ నలుగురు సభ్యుల దోపిడీ ముఠా
గతంలో ఓ హత్య, పలు దొంగతనాల కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. ఈనెల 9న మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్‌ మల్లినాథ్‌ ఉల్లిగడ్డల లోడ్‌తో వరంగల్‌కు బయలుదేరాడు. ఘట్‌కేసర్‌ పోలీస్ స్టేషన్‌ పరిధి అవుషాపూర్‌ వద్దకు రాగానే యువకులు లారీ డ్రైవర్‌ను బెదిరించి అతని వద్ద ఉన్న రూ.3వేల నగదును దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details