ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ... కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్టలో మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భాజపా అభ్యర్థి రాంచందర్ రావు, తెరాస అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి తనకు పోటీయే కాదన్నారు. దేశంలోనే అత్యధిక ఓటర్లు గల నియోజకవర్గం మల్కాజిగిరి అని దానికి తగిన నాయకుడినే ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు రేవంత్ రెడ్డి. తనని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రత్యర్థులు నాకు పోటీయే కాదు: రేవంత్ రెడ్డి - ELECTIONS
'మల్కాజిగిరి బరిలో ఉన్న ముగ్గురిలో... ఒకరు ఎవరో కూడా ఎవరికీ తెలియదు... కేవలం మామ వేలంపాటలో టికెట్ కొనుక్కొస్తే పోటీకి దిగారు. మరొకరు ఎమ్మెల్సీ పదవిలో ఉండి ప్రజలకు ఉపయోగపడిందేమీ లేదు': రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి
ప్రత్యర్థులు నాకు పోటీయే కాదు: రేవంత్ రెడ్డి