తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాన్నను గెలిపించి దిల్లీకి పంపించండి' - PUJA

పార్లమెంట్​ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలోకి తమ కుటుంబీకులను దింపుతున్నారు. చేవెళ్ల తెరాస ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్​ రెడ్డి కుమార్తె, కుమారుడు.. రాజేంద్రనగర్​ సెగ్మెంట్​లో పర్యటించారు. తన తండ్రిని గెలిపించి దిల్లీకి పంపించాల్సిందిగా కోరారు.

నాన్నను గెలిపించి దిల్లీకి పంపించండి

By

Published : Apr 4, 2019, 1:43 PM IST

ప్రచారంలో రంజిత్​ రెడ్డి కుమార్తె పూజ
చేవెళ్ల పార్లమెంట్​ అభ్యర్థి గడ్డం రంజిత్​ రెడ్డి కుమార్తె, కుమారుడు.. రాజేంద్రనగర్​ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. శంషాబాద్​ గొల్లపల్లి రషీద్​, బహదూర్​ గూడా ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఐదేళ్ల నుంచి నిధులు రాక అభివృద్ధి కుంటుపడిందని రంజిత్​ రెడ్డి కుమార్తె పూజ తెలిపారు. తన తండ్రిని గెలిపించి దిల్లీకి పంపించాలని ఆమె కోరారు.

కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేలా పోరాడే వ్యక్తిని ఎన్నుకోవాలని రంజిత్​ రెడ్డి కుమార్తె పూజ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details