దుబ్బాక ఓటమి భయం తెరాసకి ఇంకా పోలేదని, అందుకే ప్రచారానికి సమయమివ్వకుండా ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తోందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి నియోజికవర్గంలో భాజపా కార్యకర్తల సమావేశంలో రఘునందన్ రావు, ఎమ్మెల్సీ రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు తెదేపా నాయకులు భాజపాలో చేరారు.
'దుబ్బాక భయంతోనే హడావుడిగా జీహెచ్ఎంసీ ఎన్నికలు'
మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి నియోజక వర్గంలో భాజపా కార్యకర్తల సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దుబ్బాక భయం తెరాసకి ఇంకా పోలేదని విమర్శించారు. అందుకే ప్రచారానికి సమయమివ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
మీడియా మిత్రులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించండి: రఘునందన్
రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్.. తెరాసకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని రఘునందన్ మండిపడ్డారు. ప్రజల పట్ల ఆయన వ్యవహారశైలి మార్చుకోవాలని హెచ్చరించారు. కొందరు మీడియాని కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, మీడియా మిత్రులు స్వేచ్ఛగా తమ విధులు నిర్వర్తించాలని కోరారు.
ఇదీ చదవండి:జీహెచ్ఎంసీ ఎన్నికలు: నేడు భాజపా అభ్యర్థుల తొలి జాబితా