Police Solved Boy Kidnapping Case in Malkajgiri :మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం కిడ్నాప్‌నకు గురైన హర్షవర్దన్‌ను రాచకొండ ఎస్వోటీ, మల్కాజిగిరి, జనగామ జిల్లా పోలీసుల సమన్వయం, స్థానికుల సహకారంతో రక్షించారు. మైనర్ సహా నలుగురిని అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడు. మల్కాజిగిరి డీసీపీ జానకి ధరావత్, ఎస్వోటీ డీసీపీ గిరిధర్, మల్కాజిగిరి ఏసీపీ నరేశ్‌రెడ్డి, సీఐ రవికుమార్, రాములుతో కలిసి నేరేడ్మెట్లోని కమిషనర్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
Hyderabad Police Solves Malkajgiri Boy Kidnap Case :ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన రూపినేని శ్రీనివాస్.. మల్కాజిగిరిలోని సప్తగిరి కాలనీలో నివాసముంటున్నారు. బిల్డర్‌గా స్థిరపడ్డ ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు హర్షవర్దన్ సంతానం. శ్రీనివాస్ ఇంటి పక్కనుండే అన్నదమ్ములు సుంకేసుల శివ, సుంకేసుల రవి షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తుంటారు. ఇటీవల నష్టాలు రావడంతో రూ.4 లక్షల అప్పు చేశారు. దీన్ని తీర్చేందుకు హర్షవర్దన్‌ను కిడ్నాప్ చేసి రూ.2 కోట్లు వసూలు చేయాలని పథకం వేశారు. చెరో రూ.20 లక్షల చొప్పున ఇస్తామంటూ తమ స్నేహితులు, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వాసి పసిక మహిపాల్, కటుకోరి దిలీప్‌లను, ఇటీవల ఇంటర్ పూర్తి చేసినబాలుడిని తమ బృందంలో చేర్చుకున్నారు. ఈ నెల 15న సాయంత్రం 5 గంటలకు క్రికెట్ మైదానంలోకి వెళ్లిన హర్షవర్దన్‌ను కొత్త బాల్ కొనిస్తామని చెప్పి.. బలవంతంగా కారులో ఎక్కించుకొని వరంగల్ వైపు వెళ్లారు. ఇంటర్ పూర్తయిన విద్యార్థిని తార్నాకలో దింపేశారు.