తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో అర్ధరాత్రి వ్యక్తి మృతి

మేడ్చల్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రాఖీ పండుగ ఆ కుటుంబంలో విషాదం నింపింది.

ఘటనపై దర్యాప్తు జరపాలి : మృతుడి భార్య

By

Published : Aug 18, 2019, 11:06 PM IST

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా మల్లంపేట్ గ్రామానికి చెందిన మల్లేశం ఇంటికి తన సోదరీమణులు వారి భర్తలతో కలిసి రాఖీ కట్టడానికి ఇంటికి వచ్చారు. అర్ధరాత్రి అందరు పడుకున్న సమయంలో ఒక్కసారిగా అరుపులు రావడం వల్ల కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి చూశారు.

మల్లేశం కింద పడి ఉండడం గమనించి అతడిని బాచుపల్లి లోని మమత ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మల్లేశం మృతి చెందాడు. అనంతరం మృతుడి భార్య ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరపాలని దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఘటనపై దర్యాప్తు జరపాలి : మృతుడి భార్య
ఇవీ చూడండి : మీర్​పేటలో యువకుని దారుణహత్య

ABOUT THE AUTHOR

...view details