జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిశాక ఏడో తేదీ నుంచి వరదసాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో బాధితులు మీసేవల వద్దకు చేరుకుంటున్నారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని మీసేవ కేంద్రాల వద్ద ఉదయం నుంచే జనాలు బారులు తీరారు.
వరదసాయానికి పోటెత్తిన బాధితులు.. 'మీ సేవ'ల వద్ద ఆందోళనలు
గ్రేటర్ ఎన్నికలు ముగియడంతో వరదసాయం కోసం దరఖాస్తు చేసేందుకు మీసేవల వద్ద రద్దీ పెరిగింది. ఎన్నికల ముందు ప్రభుత్వం ఏడో తేదీ నుంచి పంపిణీ కార్యక్రమం చేపడుతామని హామీ ఇవ్వడంతో ఉదయం నుంచే బాధితులు పెద్దఎత్తున తరలివచ్చారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ నేరుగా అకౌంట్లలో జమ చేస్తామని స్పష్టం చేసినా రద్దీ మాత్రం తగ్గలేదు.
కుత్బుల్లాపూర్‌లో మీసేవల ముందు బారులు తీరిన ప్రజలు
ఒకవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు నేరుగా అకౌంట్లలో వేస్తామని ప్రకటించినా రద్దీ ఏమాత్రం తగ్గలేదు. సమయం 11 గంటలు దాటినా మీసేవ కేంద్రాలు తెరవకపోవడంతో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.