తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి - మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లాలో మంత్రి మల్లారెడ్డి పర్యటన

రాష్ట్రంలో వ్యవసాయరంగం అభివృద్ధిపథంలో నడుస్తోందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా ఘట్​కేసర్​ మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

Paddy  market centres  started by minister mallareddy in medchal malkajgir idistrict
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

By

Published : Oct 28, 2020, 6:44 PM IST

వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా ఘట్​కేసర్​ మండలంలోని ప్రతాపసింగారం, మాదారం, ఏదులాబాద్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా 6,400 వరి కొనుకోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలను సజావుగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీఛైర్మన్ ఎం.శరత్​చంద్రారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ నందారెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:దుబ్బాకలోనూ హుజూర్​నగర్​ ఫలితమే: జగదీశ్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details