తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో వృద్ధురాలు మృతి.. దగ్గరకు రాని కుటుంబీకులు! - మేడ్చల్​ జిల్లా వార్తలు

కరోనాతో మరణించిన వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా కుటుంబ సభ్యులు ముందుకు రాని ఘటన మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. చివరికి పురపాలక సిబ్బంది ఆ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించారు.

old women died with corona
కరోనాతో వృద్ధురాలు మృతి.. అంత్యక్రియలు చేసిన మున్సిపల్​ సిబ్బంది

By

Published : Jul 28, 2020, 11:18 AM IST

కరోనాతో బాధపడుతున్న వారి పట్ల, వ్యాధి బారిన పడి మరణించిన వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొవిడ్​తో మృతి చెందిన ఓ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. చేసేదేం లేక.. పురపాలక సిబ్బందే ఆ వృద్ధురాలి మృతదేహాన్ని స్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details