మేడ్చల్ జిల్లా దుండిగల్ పురపాలిక పరిధిలోని బహదూర్ పల్లిలో మాస్కులు లేకుండా, హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారికి అధికారులు జరిమానా విధించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు.. దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సురేష్ మున్సిపాలిటీలోని పలు ప్రాంతాల్లో పర్యటించి మాస్కులు లేని వారికి జరిమానా విధించారు. జరిమానా కట్టలేని వారితో గుంజీలు తీయించారు.
మాస్కు లేకపోతే.. వెయ్యి కట్టాల్సిందే! - మాస్కు లేకపోతే జరిమానా
లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. బయటకు వచ్చేటప్పుడు మాస్కు లేకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ నిబంధన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు కూడా. మేడ్చల్ జిల్లాలోని దుండిగల్లో అధికారులు మాస్కులు, హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానా విధించారు.
మాస్కు లేకపోతే.. వెయ్యి కట్టాల్సిందే!