తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీచైతన్య టెక్నో స్కూల్​పై ఎన్​ఎస్​యూఐ దాడి - keesara

మేడ్చల్ జిల్లాలో అనుమతి లేకుండా నడుపుతున్నారంటూ శ్రీచైతన్య టెక్నో స్కూల్​పై ఎన్​ఎస్​యూఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దాడి చేశారు. అధిక ఫీజులు కూడా వసూలు చేస్తున్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అనుమతులు లేని పాఠశాలలపై దాడులు చేస్తాం: ఎన్​ఎస్​యూఐ

By

Published : Jul 3, 2019, 6:42 PM IST

మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్​పై ఎన్​ఎస్​యూఐ సభ్యులు దాడి చేశారు. 7 నుంచి 10 వరకు అనుమతి లేనప్పటికీ తరగతు నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. పాఠశాలలోని ఫర్నీచర్​ ధ్వంసం చేశారు. విద్యార్థులను క్లాసుల నుంచి ఇంటికి పంపించివేశారు. ఇలాంటి పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోకుంటే మేమే దాడులు చేస్తామని హెచ్చరించారు.

అనుమతులు లేని పాఠశాలలపై దాడులు చేస్తాం: ఎన్​ఎస్​యూఐ

ABOUT THE AUTHOR

...view details