తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే మా బిడ్డ ప్రాణం తీసింది - TRANSFORMER

ఏది ముట్టుకుంటే ఏమవుతుందో తెలియని వయసులో ఓ బాలుడు విద్యుత్ షాక్​తో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​కు తగిలి మరణించాడు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే మా బిడ్డ ప్రాణాలు పోయాయి : తల్లిదండ్రులు

By

Published : Mar 30, 2019, 6:25 PM IST

విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​కు తగిలి ప్రాణాలు కోల్పోయిన బాలుడు
మేడ్చల్ జిల్లా ఏ.ఎస్.రావునగర్ లోని అరుల్ కాలనీ ప్లే గ్రౌండ్​లో 8వ తరగతి చదువుతున్న బాలుడు విద్యుత్ షాక్​కు గురయ్యాడు. పురుషోత్తం(13) ఆడుకుంటుండగా పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​కు తగలడంతో షాక్ కొట్టింది. తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు పోయాయని కుషాయిగూడ పోలీసు​లకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

ఇవీ చూడండి ;'అల్పాహారంలో బొద్దింక.. హోటల్ సీజ్'


ABOUT THE AUTHOR

...view details