తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్ నార్త్‌జోన్​లో కరోనా కలవరం.. వణికిపోతున్న జనం - హైదరాబాద్ కరోనా వార్తలు

హైదరాబాద్ నార్త్‌ జోన్‌లో కరోనా విజృభింస్తోంది. ఇప్పటివరకు 4,000కు పైగా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సీతాఫల్‌మండి డివిజన్‌ పరిధిలో 350 మందికి వైరస్ సోకినట్లు పేర్కొన్నారు. బేగంపేట డివిజన్ పరిధిలో 290 కేసులు నమోదయ్యాయి. కేసులు సంఖ్య పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

corona
corona

By

Published : Jul 11, 2020, 4:43 PM IST

హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచడంతో సికింద్రాబాద్, బేగంపేట్ సర్కిళ్లలో పెద్దఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి.నార్త్ జోన్ పరిధిలో ఇప్పటివరకూ 4,000 కు పైగా కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

ముఖ్యంగా సికింద్రాబాద్ సర్కిల్లోని సీతాఫల్‌మండి డివిజన్‌లో ఇప్పటి వరకూ 350 కరోనా కేసులు నమోదైనట్లు... 21 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఒక డివిజన్ పరిధిలో అత్యధికంగా కేసులు నమోదు అవుతుండంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సికింద్రాబాద్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావుతోపాటు కార్పొరేటర్ కూడా కరోనా బారిన పడ్డారు.

బేగంపేటలో 290 కేసులు

బేగంపేట డివిజన్ పరిధిలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటివరకు డివిజన్ పరిధిలో 290 కేసులు నమోదు అయినట్లు ఇందులో ఎనిమిది మంది చనిపోయినట్లు బేగంపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. బేగంపేట డివిజన్ పరిధిలో ప్రతిరోజు 20కి పైగా కేసులు నమోదు అవుతున్నాయి.

బన్సీలాల్ పేట డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 199 కరోనా కేసులు నమోదు అయినట్లు అందులో 14 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. నార్త్ జోన్ పరిధిలోని మారేడుపల్లి, తిరుమలగిరి, బొల్లారం, కార్ఖానా, బోయిన్‌పల్లి పరిధిలో కేసులో భారీగా నమోదవుతున్నాయి.

అప్రమత్తంగా ఉండాలి

పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా మార్చకుండా అధికారులు కేవలం ఇళ్ల వరకే కట్టడి చేస్తూ ఉన్నారు. పాజిటివ్ వచ్చిన ఇళ్ల సమీపంలో రసాయనిక ద్రావణాలను పిచికారీ చేస్తున్నారు. కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుని కరోనా బారిన పడకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి :ప్రగతి భవన్​కు చేరుకున్న సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details