మూడు లారీలు, ఓ డీసీఎం ఢీకొన్న ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తిమ్మాయిపల్లి గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో భాస్కర్ నాయక్ అనే డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళుతున్న డీసీఎం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడం వల్ల లారీ వెనకాల వస్తున్న మరో రెండు లారీలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయని పోలీసులు తెలిపారు.
3 లారీలు ఓ డీసీఎం ఢీ
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తిమ్మాయిపల్లి గ్రామంలో 3 లారీలు ఓ డీసీఎం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
ప్రమాదంలో ఢీకొన్న లారీలు