MLA Krishna Rao is angry about occupation of kamuni pond: కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలో చెరువుల కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. నియోజకవర్గ పరిధిలోని కాముని చెరువును ఆనుకుని ఉన్న రాఘవేంద్ర సొసైటీ వద్ద కొంతమంది అక్రమంగా మట్టి పోసి కబ్జా చేసిన విధానంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఎవరైతే చెరువు కబ్జాకి పూనుకున్నారో వారిని అరెస్ట్ చేసి.. మట్టి తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కాముని చెరువు కబ్జాపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సీరియస్.. - చెరువు విషయంలో ఎమ్మెల్యే కృష్ణారావు ఆగ్రహం
MLA Krishna Rao is angry about occupation of kamuni pond: కూకట్ పల్లి పరిధిలో కాముని చెరువును కొందరు కబ్జాకు పూనుకోవడంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ చెరువు పరిసరాలను పరిశీలించిన తరువాత.. రాఘవేంద్ర సొసైటీ వద్ద మట్టి పోసి రోడ్డు వేసి ఉండటం గమనించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. కబ్జాకు యత్నించిన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు
చెరువు సుందరీకరణకు తాను ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ని కలిసి.. చెరువు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరాలని తాను భావిస్తుంటే.. ఈ విధంగా కబ్జా చేయడం దారుణమన్నారు. ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: