భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 67వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలోని సెరినిటీ మోడల్ స్కూల్ ఆవరణలో వెయ్యి మొక్కలను నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి: మంత్రి మల్లారెడ్డి - మంత్రిమల్లారెడ్డి తాజా వార్తలు
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మేడ్చల్ జిల్లాలోని ఓ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మొక్కలు నాటండి: మంత్రి మల్లారెడ్డి
ఎంపీ సంతోశ్ కుమార్ పిలుపు మేరకు మొక్కలు నాటడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ