తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ. కోటిన్నరతో చేపడుతున్న పనులకు మంత్రి శంకుస్థాపన

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా పోచారం పురపాలక పరిధిలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడరని మంత్రి సూచించారు.

minister mallareddy in medchal district started development works
రూ. కోటిన్నరతో చేపడుతున్న పనులకు మంత్రి శంకుస్థాపనరూ. కోటిన్నరతో చేపడుతున్న పనులకు మంత్రి శంకుస్థాపన

By

Published : Jun 5, 2020, 1:36 PM IST

పట్టణ, గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు.. సీజనల్​ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఇంటితో పాటు చుట్టు ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా పోచారం పురపాలిక పరిధిలోని యంనంపేట, ఆర్జీకే కాలనీలో రూ. కోటిన్నర నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

అనంతరం మిరాలకుంట మినీ ట్యాంక్​బండ్​ నిర్మాణ పనులను కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు, మున్సిపల్​ ఛైర్మన్​తో కలిసి మంత్రి ప్రారంభించారు. పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు అందరూ పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టి స్థానికుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు మల్లారెడ్డి సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details