సంక్షేమ పథకాలే : మల్లారెడ్డి తెలంగాణలో 16 లోక్సభ స్థానాలు గెలిచి దిల్లీలో తెరాస సత్తా చాటుతామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చెప్పారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాలే గులాబీ పార్టీని గెలిపిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి చెల్లని రూపాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:పర్యాటక శాఖ ప్రచార గీతానికి అవార్డు