తెలంగాణ

telangana

ETV Bharat / state

మిస్సింగ్​ లింక్​ రోడ్డుతో ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందా?

మేడ్చల్ జిల్లాలోని హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ ఉప్పల్ నల్లచెరువు -ఫీర్జాదిగూడ మధ్య నిర్మిస్తున్న మిస్సింగ్ లింక్ రోడ్ల పనులను మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు.

nalla cheruvu and peerzadiguda missing link road construction
మేయర్ బొంతు రామ్మోహన్

By

Published : May 14, 2020, 12:19 PM IST

మేడ్చల్ జిల్లాలోని హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ ఉప్పల్ నల్లచెరువు - పీర్జాదిగూడ మధ్య మిస్సింగ్ లింక్​ రోడ్డును నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులను మంత్రి మల్లారెడ్డి, మేయర్ రామ్మోహన్​లు పరిశీలించారు. ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్య ఏ మేర పరిష్కారం అవుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడువులోగా పనులు పూర్తయ్యే విధంగా చూడాలని మంత్రి మల్లారెడ్డి, మేయర్ రామ్మోహన్​లు అధికారులకు సూచించారు. వారి వెంట పీర్జాదిగూడ, బోడుప్పల్ నగర పాలక మేయర్లు జక్కా వెంకట్ రెడ్డి, బుచ్చిరెడ్డిలు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details