మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఏళ్ల తరబడి ఉన్న దేవర బాలాజీ వాసుల సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, తెరాస మున్సిపల్ శాఖ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు మంత్రిని ఆయన నివాసంలో కలిశారు.
'మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా' - దేవరబాలజీ వాసుల సమస్యపై మంత్రి మల్లారెడ్డి
దేవర బాలాజీ వాసుల సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. 10 రోజుల్లో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
'మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా'
మున్సిపాలిటీ పరిధిలోని దేవర బాలాజీలో సుమారు 300 ఇళ్లు ఉన్నాయని, వాటికి గతంలో గ్రామపంచాయతీ వారు ఇంటి నంబర్లు ఇవ్వలేదని వారు తెలిపారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడంలేదన్నారు. స్పందించిన మంత్రి మల్లారెడ్డి సమస్యను మంత్రికి వివరించి పది రోజులో పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు.
ఇదీ చూడండి: భాగ్యనగరంలో ఎడతెరిపి లేని వానలు.. ఇంకా నీళ్లలోనే పలు కాలనీలు