తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేదల సొంతింటి కల నెరవేర్చడమే.. ప్రభుత్వ లక్ష్యం' - it and municipal minister ktr

హైదరాబాద్​ కూకట్​పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. బాలానగర్​ కూడలిలోని చిత్తారమ్మనగర్​లో లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేశారు.

'పేదల సొంతింటి కల నెరవేర్చడమే.. ప్రభుత్వ లక్ష్యం'

By

Published : Nov 14, 2019, 4:24 PM IST

హైదరాబాద్​ కూకట్​పల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

ముందుగా బాలానగర్​ కూడలిలోని చిత్తారమ్మనగర్​లో లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేశారు. అనంతరం అల్లాపూర్​ డివిజన్​ ఇండోర్​ షటిల్​ కోర్టు, కేపీహెచ్​బీ కాలనీ 6వ ఫేజ్​లో ఇండోర్​ స్టేజియం, రాజీవ్​ గాంధీ చౌరస్తాలో చేపల మార్కెట్​ను ప్రారంభించారు. ఖైతలాపూర్​లో అయ్యప్ప సొసైటీ ఫ్లై ఓవర్​ నిర్మాణానికి భూమి పూజ చేశారు.

కేటీఆర్​తో పాటు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని మాధవరం కృష్ణారావు అన్నారు.

'పేదల సొంతింటి కల నెరవేర్చడమే.. ప్రభుత్వ లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details