మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చక్రిపురం నుంచి చర్లపల్లికి వెళ్లే దారిలో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై కట్టెలను అడ్డుగా వేసి నిరసన చేపట్టారు. స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు తమకు పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
కుషాయిగూడలో రోడ్డెక్కిన వలస కూలీలు.. - migrant workers protest
మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో వలస కూలీలు ఆందోళనకు దిగారు. సొంతూళ్లకు వెళ్లేందుకు తమకు పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పాసులు ఇవ్వాలంటూ కూలీల ఆందోళన
Last Updated : May 9, 2020, 11:03 AM IST