మేడ్చల్ జిల్లా పురపాలక సంఘ పరిధిలోని కిష్టాపూర్లో మున్సిపల్ ఛైర్పర్సన్ దీపిక నర్సింహా రెడ్డి పర్యటించారు. ఈ ప్రాంతంలో సుమారు 200 మంది వలస కార్మికులు ఉన్నారని... వారంతా ఇక్కడ కూలీ చేసుకునే వారని తెలిపారు. లాక్డౌన్ కారణంగా వారంతా ఇక్కడ ఉండిపోయారని.... కరోనాపై వారికి అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. మాస్కులు, శానిటేజర్లు అందించి... ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
'ఇతర రాష్ట్రాలవారికి వసతితోపాటు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాం'
కూలీ పనుల నిమిత్తం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చిక్కుకుపోయిన వారికి అన్ని వసతులు కల్పిస్తూ... కరోనాపై అవగాహన కల్పించామని మేడ్చల్ మున్సిపల్ ఛైర్పర్సన్ దీపికానర్సింహా రెడ్డి వెల్లడించారు.
'ఇతర రాష్ట్రాలవారికి వసతితోపాటు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాం'