హైకోర్టు న్యాయవాదులు వామన రావు, నాగమణి దంపతుల హత్యకు నిరసనగా మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులకు తెలంగాణలో రక్షణ లేదని ఆరోపించారు.
'న్యాయవాదుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలి' - తెలంగాణ వార్తలు
పెద్దపల్లి జిల్లాలో న్యాయవాద దంపతుల హత్యను బార్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు విధులు బహిష్కరించి నిరసనలు చెపట్టారు. దోషులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
'నిందితులను వెంటనే శిక్షించాలి.. సీబీఐకి కేసు అప్పగించాలి'
ప్రభుత్వం వెంటనే భద్రత అవసరమున్న న్యాయవాదులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకు అప్పగించాలన్నారు. లాయర్లపై దాడులు జరిపితే ప్రతీకార దాడులకు కూడా సిద్ధమంటూ హెచ్చరించారు.
ఇదీ చూడండి:న్యాయవాదుల హత్యకు కారణమేంటి? అసలేం జరిగింది?