కరోనాను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట ప్రణాళికలు రచిస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దూలపల్లి అటవీ అకాడమీలో ఐసోలేషన్ సెంటర్ కోసం భవనాలను మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పరిశీలించారు. జనావాసాలకు దూరంగా ఉన్న అకాడమీ.. ఆహ్లాదకరమైన వాతావరణంతో చికిత్సకు అనువుగా ఉంటుందని అధికారులు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
దూలపల్లిలో కరోనా ఐసోలేషన్ సెంటర్..! - దూలపల్లి అటవీ అకాడమీలో కరోనా ఐసోలేషన్వార్డు
మేడ్చల్ జిల్లా దూలపల్లి అటవీ అకాడమీలోని భవనాలను కలెక్టర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కరోనా ఐసోలేషన్ సెంటర్ కోసం ఇక్కడి వసతులు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు.
ఐసోలేషన్ సెంటర్ కోసం అటవీ అకాడమీ భవనాల పరిశీలన